శరీరాన్ని గాడిలో పెట్టే కొన్ని యోగాసనాలు..

ABN , First Publish Date - 2022-05-03T17:54:37+05:30 IST

యోగా చేయమంటే ‘నా ఒళ్లు అందుకు సహకరించదు’ అనే మాట వింటూ ఉంటాం! ‘ఫ్లెక్సిబిలిటీ’ మీద కాకుండా, ఊపిరి మీద, కండరాలు సాగుతున్న భావనల మీద

శరీరాన్ని గాడిలో పెట్టే కొన్ని యోగాసనాలు..

ఆంధ్రజ్యోతి(03-05-2022)

యోగా చేయమంటే ‘నా ఒళ్లు అందుకు సహకరించదు’ అనే మాట వింటూ ఉంటాం! ‘ఫ్లెక్సిబిలిటీ’ మీద కాకుండా, ఊపిరి మీద, కండరాలు సాగుతున్న భావనల మీద మనసు కేంద్రీకరించి, సాధన చేస్తే యోగా సాధన తేలికే! పైగా దైనందిన జీవితంలో చిన్న చిన్న పనులకు కూడా సహకరించని శరీరాన్ని గాడిలో పెట్టాలంటే కొన్ని యోగాసనాలు సాధన చేయక తప్పదు. అవేంటంటే....


ఉత్తనాసనం

ఈ ఆసనం వెన్ను కింది భాగం సాగేలా చేస్తుంది. ఆసనం నెమ్మదిగా ఊపిరి పీల్చి వదులుతూ చేయాలి. పూర్తి ఆసనానికి కనీసం 30 సెకండ్ల నుంచి 3 నిమిషాల సమయం తీసుకోవచ్చు. 


ఈ ఆసనం ఎలా వేయాలంటే....

కాళ్ల మధ్య అర అడుగు ఎడం ఉండేలా నిలబడి మోకాళ్లను కొద్దిగా వంచి, చేతులు పైకి లేపి, నడుము దగ్గర్నుంచి శరీరాన్ని ముందుకు వంచాలి.


పైకి లేపిన రెండు చేతులు పాదాలను తాకించాలి.


ఇలా చేసే సమయంలో మోకాళ్ల వెనక లాగినట్టు అనిపించడం సహజం. ఈ నొప్పి ఆసనం అలవాటయ్యేకొద్దీ తగ్గుతుంది.


అలాగే ప్రారంభంలో కాళ్లను నిలువుగా ఉంచలేం. కాబట్టి మోకాళ్లు కొద్దిగా వంచి ఆసనం అలవాటు చేసుకోవచ్చు.


బద్ధకోణాసనం

ఈ ఆసనంతో తొడలు, కటి ప్రదేశం, మోకాళ్లు సాగుతాయి. ఆ ప్రదేశాల్లో ఉన్న ఇబ్బందులు తొలగి సంబంధిత అవయవాలను తేలికగా, ఎటువంటి ఆటంకం లేకుండా కదిలించగులగుతారు. 


ఈ ఆసనం ఎలా వేయాలంటే....

కాళ్లను ఎదురుగా ఉంచి కూర్చోవాలి.


కాళ్లను శరీరానికి దగ్గరగా మడిచి, రెండు పాదాలను సాధ్యమైనంతగా దగ్గరకు చేర్చాలి.


రెండు చేతులతో రెండు పాదాల బొటనవేళ్లను పట్టుకోవాలి.


వెన్ను నిటారుగా ఉంచాలి.


మోకాళ్లను నేలకు తాకించే ప్రయత్నం చేయకూడదు. తొడలు, పిరుదులు నేలకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.

Read more