బైక్‌పై నుంచి పడి మహిళ మృతి

ABN , First Publish Date - 2022-05-14T06:54:28+05:30 IST

మండలంలోని విఠల్‌వాడి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందినట్లు ఎస్సై విజయ్‌ కొండ తెలిపారు.

బైక్‌పై నుంచి పడి మహిళ మృతి

పెద్ద కొడప్‌గల్‌, మే 13 : మండలంలోని విఠల్‌వాడి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందినట్లు ఎస్సై విజయ్‌ కొండ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఖండెబల్లూర్‌ గ్రామానికి చెందిన విరుగొండ అతని చెల్లెలు లక్ష్మి కలిసి ఖండెబల్లూర్‌ నుంచి పొట్పల్లి వెళుతుండగా విఠల్‌ వాడి గ్రామ శివారు సమీపంలో బైక్‌ నుంచి లక్ష్మి జారి పడింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.  

Read more