భర్త కోరిక నెరవేర్చిన భార్య.. ఎంతో కష్టపడి బస్సు డ్రైవర్‌గా మారి..

ABN , First Publish Date - 2022-05-06T05:42:36+05:30 IST

చాలా మంది వ్యక్తులు తమ భార్యలను కలెక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, వైద్యులుగా చూడాలనుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు. కానీ, ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను బస్సు డ్రైవర్‌గా చూడాలనుకున్నాడు. ఎందుకంటే అతను బస్ కండక్టర్. ఒకే బస్సులో తన భార్య డ్రైవర్‌గా, తను కండక్టర్‌గా ఉండాలనుకున్నాడు...

భర్త కోరిక నెరవేర్చిన భార్య.. ఎంతో కష్టపడి బస్సు డ్రైవర్‌గా మారి..

చాలా మంది వ్యక్తులు తమ భార్యలను కలెక్టర్లుగా, ఉపాధ్యాయులుగా, వైద్యులుగా చూడాలనుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు. కానీ, ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను బస్సు డ్రైవర్‌గా చూడాలనుకున్నాడు. ఎందుకంటే అతను బస్ కండక్టర్. ఒకే బస్సులో తన భార్య డ్రైవర్‌గా, తను కండక్టర్‌గా ఉండాలనుకున్నాడు. అందుకే ఆమెను డ్రైవింగ్ స్కూల్‌లో జాయిన్ చేశాడు. భర్త కోరిక మేరకు అతని భార్య కష్టపడి డ్రైవింగ్ నేర్చుకుంది. త్వరలోనే విధుల్లో చేరనుంది. 


ఘజియాబాద్‌కు చెందిన ముఖేష్ కుమార్ అనే వ్యక్తి తన భార్య వేద్ కుమారిని బస్సు డ్రైవర్‌గా చూడాలనుకున్నాడు. కాన్పూర్‌లోని రోడ్‌వేస్ డ్రైవింగ్ సెంటర్‌లో చేర్పించాడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన వేద్ కుమారి ఎంతో శ్రద్ధతో డ్రైవింగ్ నేర్చుకుంది. దేశంలోనే తొలిసారిగా కాన్పూర్‌లో మహిళలకు భారీ వాహనాలు నడపడంలో శిక్షణ ఇస్తున్నారు. అందుకే ముఖేష్ తన భార్యను అక్కడ చేర్చాడు. ఏడాదిన్నర వయసున్న కూతురిని దగ్గర పెట్టుకుని ఆమె బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. 


మే 15వ తేదీతో ఆమె శిక్షణ పూర్తవుతుంది. తనకు భర్త పని చేస్తున్న ఘజియాబాద్ రోడ్‌వేస్ డిపోలోనే పోస్టింగ్ ఇవ్వాలని వేద్ కుమారి దరఖాస్తు చేసుకుంది. ఒకే బస్‌లో ఇద్దరూ డ్రైవర్, కండక్టర్లుగా పని చేయాలనేది తన భర్త కోరిక అని వేద్ కుమారి చెప్పింది. 


Read more