బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్... చివరన ‘వుడ్’ అనే పదాన్ని ఎందుకు చేరిందో తెలుసా?

ABN , First Publish Date - 2022-05-09T16:05:57+05:30 IST

బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్... ఈ మూడు పేర్లలో...

బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్... చివరన ‘వుడ్’ అనే పదాన్ని ఎందుకు చేరిందో తెలుసా?

బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్... ఈ మూడు పేర్లలో కామన్ గా ఉన్న పదం వుడ్. అమెరికాలో మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ భాషల చిత్ర పరిశ్రమలలో ఈ పదం వాటడం చాలా సాధారణం. ఉదాహరణకు కన్నడ సినిమాను శాండల్‌వుడ్ అని, తెలుగు సినిమాని టాలీవుడ్ అని, తమిళ సినిమాని కోలీవుడ్ అని అంటారు. 'వుడ్' అనే పదం భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్ సినిమాల్లోనూ ప్రస్తావనకు వస్తుంది. ఇది ఎలా మొదలైందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం హాలీవుడ్‌తో ముడిపడివుంది.




ఇక్కడ నుండి ప్రేరణ పొంది ఇతర చలనచిత్ర పరిశ్రమలు దీనిని ఫాలో అయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి హెచ్.జె. విట్లీ (H.J. విట్లీ)ని హాలీవుడ్ ఫాదర్ అని పిలుస్తారు. ఆతనే అమెరికా చిత్ర పరిశ్రమకు హాలీవుడ్ అనే పేరు పెట్టాడు. దీని అర్థం ఆనందం. నిజానికి హాలీవుడ్ అనేది అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఉన్న ఒక ప్రదేశం పేరు. ఇతర దేశాల్లో ఇక్కడి సినిమాల రీచ్ పెరగడంతో హాలీవుడ్ పేరు మారుమోగిపోయింది. హాలీవుడ్‌లో చాలా చారిత్రక స్టూడియోలు ఉన్నాయి. 1930 నాటికి, అమెరికన్ చలనచిత్ర పరిశ్రమ పేరు అంటే హాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హిందీ చిత్ర పరిశ్రమను బాలీవుడ్ అని పిలిచే ఘనత బెంగాల్ సినిమాకే దక్కుతుందని చెబుతారు. 1930లో కలకత్తాలోని బెంగాలీ చిత్ర పరిశ్రమ 'టోలీగంజ్' అనే ప్రాంతంలో ఉండేది. దీని గురించి రాస్తూనే తొలిసారిగా జూనియర్ స్టేట్స్ మన్ అనే పత్రిక ‘టాలీవుడ్’ అనే పదాన్ని వాడింది. ఇప్పుడు టాలీవుడ్ అనే పదాన్ని తెలుగు సినిమాకు వాడుతున్నారు. బెంగాల్ సినిమా పేరు ప్రసిద్ధి చెందింది. దీని తర్వాత హిందీ చిత్ర పరిశ్రమ హాలీవుడ్ నుండి 'హెచ్'ని తీసివేసి 'బి'ని పెట్టి బాలీవుడ్ చేసింది. ఆ కాలంలో, ముంబైని బొంబాయి అని పిలిచేవారు, అందుకే బాలీవుడ్‌లో 'బి' అక్షరానికి ప్రాధాన్యతనిస్తూ ఈ పేరు పెట్టారు. ఇలా విభిన్న భాషా చిత్ర పరిశ్రమలకు ఆయా పేర్లు వచ్చాయి.

Read more