అమ్మకు ఏ గిఫ్ట్‌ ఇస్తారు

ABN , First Publish Date - 2022-05-08T05:30:00+05:30 IST

ఈ రోజు మదర్స్‌డే. ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున అమ్మకు ఏం గిఫ్ట్‌ ఇస్తారు. ఏదో ఒకటి కాకుండా అమ్మకు ఇష్టమైనది ఇవ్వండి.

అమ్మకు ఏ గిఫ్ట్‌ ఇస్తారు

ఈ రోజు మదర్స్‌డే. ఎంతో ప్రత్యేకమైన ఈ రోజున అమ్మకు ఏం గిఫ్ట్‌ ఇస్తారు. ఏదో ఒకటి కాకుండా అమ్మకు ఇష్టమైనది ఇవ్వండి. మరి అమ్మకు ఏది ఇష్టమో తెలుసుకోవాలంటే  ఈ క్విజ్‌ పూర్తి చేయండి.


మీ అమ్మ హాలిడే ట్రిప్‌కి వెళ్లాలనుకుంటున్నారు. ఏ ప్రదేశానికి వెళతారో ఊహించండి.

ఎ. ఊటీ బి. స్నేహితులతో కలిసి కులుమనాలీ

సి. బీచ్‌ ఉన్న ఏదైనా ఊరికి డి. తెలియదు


అమ్మ సూపర్‌మార్కెట్‌కి వెళ్లేటప్పుడు  ఏ వస్తువులు వెంట తీసుకెళతారు?

ఎ. సన్‌గ్లాసెస్‌, హ్యాండ్‌బ్యాగ్‌

బి. తొందరలో వస్తువులు మర్చిపోతారు.

సి. వస్తువులు తీసుకురావడానికి ఎకోఫ్రెండ్లీ బ్యాగును తీసుకెళతారు. 

డి. రాత్రి తయారుచేసిన వస్తువుల లిస్ట్‌ తీసుకెళతారు.


మీ పుట్టిన రోజున సాధారణంగా మీ అమ్మ చేస్తుంటారు?

ఎ.  అందరినీ పిలుస్తారు. ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తారు.

బి. ఇంటికి స్నేహితులను పిలిచి సినిమా చూడమని చెబుతారు. లేదా డబ్బులిచ్చి స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్లమని చెబుతారు.

సి. స్వయంగా ఇంటిని అలంకరిస్తారు. రకరకాల వంటలు తయారుచేస్తారు.

డి. మిమ్మల్ని, మీ స్నేహితులను బయటకు తీసుకెళ్లి పిజ్జా తినిపిస్తారు.


మీ మదర్‌ ఎలాంటి సినిమాలు ఇష్టపడతారు.

ఎ. రొమాంటిక్‌ మూవీస్‌ బి. యాక్షన్‌ థ్రిల్లర్స్‌

సి. కుటుంబ కథాచిత్రాలు డి. సైన్స్‌ ఫిక్షన్‌


ఆమె ఫేవరేట్‌ డ్రింక్‌ ఏది?

ఎ. మాక్‌టెయిల్‌ బి. ఇన్‌స్టంట్‌ కాఫీ

సి. హెర్బల్‌ టీ డి. మిల్క్‌షేక్‌


మధ్యాహ్నం ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు?

ఎ. పార్లర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకుంటారు.

బి. కాఫీ తాగుతూ ఇష్టమైన సినిమా చూస్తారు.

సి. పార్కుకు వెళతారు.

డి. చేయాల్సిన పనుల జాబితా తయారుచేస్తారు.


స్కోర్‌

సమాధానాలు ‘ఎ’ ఎక్కువగా వస్తే...: పెర్‌ఫ్యూమ్‌ని గానీ, హ్యాండ్‌బ్యాగ్‌ని కానీ గిఫ్ట్‌గా ఇస్తే ఆమె సంతోషిస్తారు. 

సమాధానాలు ‘బి’ ఎక్కువగా వస్తే... : ఆమె తన కోసం కాస్త సమయాన్ని కోరుకుంటున్నారు. పిల్లల బాధ్యతను ఒకపూట ఎవరైనా చూసుకుంటే బాగుండని అనుకుంటున్నారు. కాబట్టి ఆమె కోసం ఒక పూట హాలీడేని గిఫ్ట్‌గా ఇవ్వండి. ఇంటి పనులన్నీ మీరు చక్క బెడతారని చెప్పండి. 

సమాధానాలు ‘సి’ ఎక్కువగా వస్తే...: క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. ఇంటిని నీట్‌గా సర్దుకుంటారు. ఒక పూలగుచ్చం, టేబుల్‌క్లాత్‌, కాఫీ మగ్గులు, బేకింగ్‌ ట్రే లాంటివి ఇస్తే సంతోషిస్తారు. 

సమాధానాలు ‘డి’ ఎక్కువగా వస్తే...: మీరందరూ గర్వించే మనిషి ఆమె. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ప్రతిరోజు ఉపయోగపడే వాటిని గిఫ్ట్‌గా అందిస్తే సంతోషిస్తారు. పిక్చర్‌ ఫ్రేమ్‌లాంటివి ఇవ్వొచ్చు.

Read more