Weekend Comment By RK: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నారా..? తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే వేగంగా జగన్ ముందస్తు ఏర్పాట్లలో ముందున్నారా..? ఏపీ సంక్షేమం సంక్షోభం సంక్షోభంలో పడటమే జగన్ ముందస్తు ఆలోచనల అసలు కారణమా..? ముందస్తు ఎన్నికలకు పోయే విషయంలో జగన్‌కు కేంద్రం ఏ మేరకు సహకరిస్తుంది..? జగన్ నిర్ణయాన్ని బట్టే తాము ముందస్తుకెళ్లాలని కేసీఆర్ ఎందుకు భావిస్తున్నారు..? కేసీఆర్ ఒంటరిగా ముందస్తుకు వెళితే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..? టీడీపీ-జనసేన మధ్య చిగురిస్తున్న పొత్తు కూడా జగన్ ముందస్తు నిర్ణయానికి కారణమా..? ముందస్తు ఆలోచనల వల్లే జగన్ కుట్ర సిద్ధాంతాలతో మీడియాపై దాడికి తెగబడ్డారా..? తల్లీ, చెల్లిని వాడుకుని వదిలేసిన జగన్ ప్రజల సానుభూతి కోసం ఏం చేయనున్నారు..?
ఈసారి టిక్కెట్ల పంపిణీ విషయంలో జగన్ రెడ్డి ఎలాంటి ప్రయోగాలు చేయనున్నారు..? మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ విషయంలో జగన్ సర్కార్ ఇన్ని పిల్లిమొగ్గలు ఎందుకేసింది..? నారాయణకు కోర్టు బెయిలు ఇవ్వడాన్ని కూడా సజ్జల తప్పుపట్టడం దేనికి సంకేతం..? వివేక హత్య కేసులో నిందితుల్ని వెనుకేసుకొస్తున్న వారికి నీతులు చెప్పే నైతికత ఉందా..? ప్రశ్నాపత్రాల లీకేజీ నిజంగానే జరిగి ఉంటే మంత్రి బొత్స ఎందుకు రాజీనామా చేయలేదు..? తప్పుడు కేసులతో గెలవలేక కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించే ఏడుపులు ఇంకెంతకాలం..? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కేమార్క్ సునిశిత విశ్లేషణ. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ రాత్రి 8.30 గంటలకు. తప్పక చూడండి.