సమరయోధుడు అశ్వత్ధనారాయణ కన్నుమూత

ABN , First Publish Date - 2022-05-08T08:23:17+05:30 IST

సమరయోధుడు అశ్వత్ధనారాయణ కన్నుమూత

సమరయోధుడు అశ్వత్ధనారాయణ కన్నుమూత

జరుగుమల్లి (కొండపి), మే 7: ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నందనవనం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు అనుమాల అశ్వత్ధనారాయణ (93) శనివారం కన్నుమూశారు. వయోభారంతో ఆయన గ్రామంలోని తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచారు. అశ్వత్ధనారాయణ 1942లో జరిగిన క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని బళ్లారిలో జైలు జీవితం గడిపారు. అప్పట్లో ఆచార్య ఎన్‌జీ రంగాకు సహచరుడిగా ఉండేవారు. పలుకూరు గ్రామంలో ఉన్న తన పూర్వీకుల ఆస్తిని ప్రభుత్వ పాఠశాలకు దానంగా ఇచ్చారు.  

Read more