కళకళలాడుతున్న Venkanna హుండీ

ABN , First Publish Date - 2022-05-05T01:33:48+05:30 IST

తిరుమల వెంకన్న హుండీ ఆదాయం కళకళలాడుతోంది. కరోనా తర్వాత మార్చినెల తరహాలోనే ఏప్రిల్‌ నెలలోనూ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది.

కళకళలాడుతున్న Venkanna హుండీ

తిరుమల: తిరుమల వెంకన్న హుండీ ఆదాయం కళకళలాడుతోంది. కరోనా తర్వాత మార్చినెల తరహాలోనే ఏప్రిల్‌ నెలలోనూ హుండీ ఆదాయం వంద కోట్లు దాటింది. ఏప్రిల్‌ 1 నుంచి 30వ తేదీ వరకు 20,62,323 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా, వీరి ద్వారా రూ.127.63 కోట్ల హుండీ ఆదాయం లభించింది. ఏప్రిల్‌ 13వ తేదీన అత్యధికంగా 88,748మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకలతో అత్యధికంగా రూ.5.11 కోట్లు లభించడం గమనార్హం. మార్చి నెలలో 19,72,656 మంది దర్శించుకోగా, వీరు సమర్పించిన కానుకల ద్వారా రూ.128.61 కోట్ల ఆదాయం సమకూరిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గడంతో మార్చి నెల నుంచి టీటీడీ భక్తుల సంఖ్యను పెంచిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఏప్రిల్‌ నెల నుంచి కొన్ని ప్రత్యేక దర్శనాలతో పాటు ఆర్జితసేవలను టీటీడీ తిరిగి ప్రారంభించింది. మరోవైపు టికెట్‌ రహిత దర్శనాలనూ టీటీడీ తిరిగి కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. 

Read more