Hyderabadలో నారాయణ అరెస్ట్.. ఏపీకి తరలింపులో ట్విస్ట్‌.. చర్చల తర్వాత..

ABN , First Publish Date - 2022-05-10T18:46:51+05:30 IST

Hyderabadలో నారాయణ అరెస్ట్.. ఏపీకి తరలింపులో ట్విస్ట్‌.. చర్చల తర్వాత..

Hyderabadలో నారాయణ అరెస్ట్.. ఏపీకి తరలింపులో ట్విస్ట్‌.. చర్చల తర్వాత..

హైదరాబాద్ సిటీ/రంగారెడ్డి/అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌ పొంగూరు నారాయణను (Narayana) ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ను, ఆయన సతీమణి రమాదేవిని .. నారాయణ కారులోనే హైదరాబాద్ (Hyderabad) నుంచి అధికారులు ఏపీకి తరలిస్తున్నారు. అయితే.. ఈ తరలింపు విషయంలో అధికారులకు తెలంగాణ పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర ఏపీ సీఐడీ అధికారులను తెలంగాణ పోలీసులు (TG Police) నిలిపివేశారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసులతో ఏపీ సీఐడీ అధికారులు (AP CID) చర్చించారు. నారాయణ అరెస్ట్‌పై తమకు ముందుగా ఎందుకు సమాచారం ఇవ్వలేదని సీఐడీని పోలీసులు ప్రశ్నించారు. అయితే.. ఈ క్రమంలో తమ దగ్గరనున్న నారాయణ అరెస్ట్‌ వారెంట్‌‌ను పోలీసులకు.. ఏపీ సీఐడీ చూపగా ఈ వివాదం ఇంతటితో ముగిసింది. కాగా.. ఈ చర్చలు ముగియడంతో నారాయణను ఏపీ తరలింపునకు సీఐ బాలరాజు అనుమతిచ్చారు. అయితే ఆయన్ను విజయవాడకు తరలిస్తారా.. లేకుంటే చిత్తూరుకు తరలిస్తారా అనేది తెలియాల్సి ఉంది.



Read more