రైతుల కష్టానికి ప్రభుత్వాలదే బాధ్యత: రేవంత్‌

ABN , First Publish Date - 2022-05-05T08:59:38+05:30 IST

రైతుల కష్టానికి ప్రభుత్వాలదే బాధ్యత: రేవంత్‌

రైతుల కష్టానికి ప్రభుత్వాలదే బాధ్యత: రేవంత్‌

హైదరాబాద్‌, మే 4(ఆంధ్రజ్యోతి): రైతుల కష్టం క‘న్నీటి’ పాలవుతుంటే సీఎం కేసీఆర్‌, ఆయన కొడుకు కేటీఆర్‌ ప్లీనరీలు, ఫాంహౌ్‌సలలో గ్రీనరీల మధ్య సేద తీరుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ దరిద్రపు పాలనకు దయనీయ స్థితి ఇదన్నారు. ధాన్యం కొనుగోళ్ల డ్రామాతో కాలయాపన చేసిన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలే ఈ నష్టానికి బాధ్యత వహించాలని బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. రాష్ట్రానికి పట్టిన గులాబీ పురుగును తరిమికొట్టేందుకే వరంగల్‌లో రైతు సమస్యలపై రాహుల్‌గాంధీ సభను నిర్వహిస్తున్నామని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ 6న జరిగే రాహుల్‌గాంధీ సభ విజయవంతం చేసేందుకు 15 పీసీసీ కమిటీలు సబ్‌ కమిటీలు వేసుకున్నట్లు చెప్పారు. 

Read more