పనజి: వెటరన్ క్రికెటర్, రాజకీయ నాయకుడు కీర్తి ఆజాద్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గోవా ఇన్చార్జిగా ఆ పార్టీ బుధవారంనాడు నియమించింది. గోవా యూనిట్ ఇన్చార్జిగా ఉన్న టీఎంసీ ఎంపీ ముహువ మొయిత్ర స్థానంలో Kirti Azadను పార్టీ నియమించింది. కీర్తి ఆజాద్ నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్టు టీఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి
కీర్తి ఆజాద్ గత ఏడాది కాంగ్రెస్ నుంచి TMCలో చేరారు. దీనికి ముందు ఆయన బీహార్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా టీఎంసీ పలువురు కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి తీసుకుంది. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవడంలో ఆ పార్టీ విఫలమైంది.