చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2022-05-11T06:49:26+05:30 IST

కోటగిరి మండలం పొతంగల్‌- బీర్కూర్‌ రహదారి పై కల్లూర్‌ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలు గంగామణి (50) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాము తెలిపారు. బోధన్‌ మండలంలోని హున్సా గ్రామానికి చెందిన గంగామణి తన అల్లుడైన నరేందర్‌తో కలిసి కల్లూర్‌ గ్రామంలో ఓ శుభకార్యానికి టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై సోమవారం బయలుదేరి వెళ్లారు. కల్లూర్‌ సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే విద్యుత్‌ స్తంభానికి ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స నిమిత్తం 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. నరేందర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గంగామణి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై రాము తెలిపారు. నరేందర్‌ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

కోటగిరి, మే 10: కోటగిరి మండలం పొతంగల్‌- బీర్కూర్‌ రహదారి పై కల్లూర్‌ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలు గంగామణి (50) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై రాము తెలిపారు. బోధన్‌ మండలంలోని హున్సా గ్రామానికి చెందిన గంగామణి తన అల్లుడైన నరేందర్‌తో కలిసి కల్లూర్‌ గ్రామంలో ఓ శుభకార్యానికి టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంపై సోమవారం బయలుదేరి వెళ్లారు. కల్లూర్‌ సమీపంలోకి రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే విద్యుత్‌  స్తంభానికి ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స నిమిత్తం 108లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. నరేందర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గంగామణి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై రాము తెలిపారు. నరేందర్‌ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

మామిడి చెట్టు పై నుంచి పడి వ్యక్తి మృతి  

కోటగిరి మండలంలోని చేతన్‌నగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో గల ఓ మామిడి తోటలో చెట్టుపై నుంచి పడి బోధన్‌ హన్మాండ్లు (39) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై రాము తెలిపారు. రుద్రూరు మండలంలోని రాణంపల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లు మహారాష్ట్రలోని కొండల్‌వాడి సమీపంలోని మాచ్‌నూర్‌ గ్రామానికి సోమవారం ఓ శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. శుభకార్యం ముగించుకుని బంధువుల వద్ద నుంచి కొంత నగదు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. చేతన్‌నగర్‌ గ్రామంలోని ఓ మామిడి తోటలో రాత్రివేళ మామిడి కాయలు తెంపేందుకు చెట్టుపైకి ఎక్కి ప్రమాదవశాత్తు జారీ కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. 


Read more