అదృశ్యమైన బాలుడు మృతి

ABN , First Publish Date - 2022-05-12T05:51:05+05:30 IST

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్‌ ఒడ్డెరకాలనీకి చెందిన టేకు విజయ్‌కుమార్‌(13) అనే బాలుడు ఐదు రోజుల క్రితం కనిపించ కుండా పోగా, బుధవారం సాయంత్రం కాలనీ సమీపంలోని పాడుబడిన బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. స్థానిక ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7న తనకు సైకిల్‌ కొనివ్వాలని తండ్రి సతీష్‌ వద్ద విజయ్‌కుమార్‌ మారం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా ప్రస్తు తానికి సైకిల్‌ కొనివ్వాలేదని, తర్వాత కొనిస్తానని కొడుకును సముదాయించాడు. ఈ విషయమై మారుమాట్లాడకుండా స్నేహితులతో ఆడుకుంటానని ఇంటి నుం చి బయటకు వెళ్లిన విజయ్‌కుమార్‌ తిరిగి ఇంటికి రాలేదు. తన కొడుకు కనిపిం చడంలేదని, ఈనెల 9న తండ్రి సతీష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్‌ ఆచూకి గురించి చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే కాలనీ సమీపంలోని పాడుబడిన బావి వద్ద ఉరివేసుకున్న బాలుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవం అదృశ్యమైన విజయ్‌కుమార్‌ది అని కుటుంబసభ్యులు నిర్దారించ డంతో ఎస్సై రాజశేఖర్‌ శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆ

అదృశ్యమైన బాలుడు మృతి

కమ్మర్‌పల్లి, మే11: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్‌ ఒడ్డెరకాలనీకి చెందిన టేకు విజయ్‌కుమార్‌(13) అనే బాలుడు ఐదు రోజుల క్రితం కనిపించ కుండా పోగా, బుధవారం సాయంత్రం కాలనీ సమీపంలోని పాడుబడిన బావి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. స్థానిక ఎస్సై రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7న తనకు సైకిల్‌ కొనివ్వాలని తండ్రి సతీష్‌ వద్ద విజయ్‌కుమార్‌ మారం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా ప్రస్తు తానికి సైకిల్‌ కొనివ్వాలేదని, తర్వాత కొనిస్తానని కొడుకును సముదాయించాడు. ఈ విషయమై మారుమాట్లాడకుండా స్నేహితులతో ఆడుకుంటానని ఇంటి నుం చి బయటకు వెళ్లిన విజయ్‌కుమార్‌ తిరిగి ఇంటికి రాలేదు. తన కొడుకు కనిపిం చడంలేదని, ఈనెల 9న తండ్రి సతీష్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీసులు, కుటుంబ సభ్యులు విజయ్‌కుమార్‌ ఆచూకి గురించి చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే కాలనీ సమీపంలోని పాడుబడిన బావి వద్ద ఉరివేసుకున్న బాలుడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవం అదృశ్యమైన విజయ్‌కుమార్‌ది అని కుటుంబసభ్యులు నిర్దారించ డంతో ఎస్సై రాజశేఖర్‌ శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్‌ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Read more