తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సూచనలు చేసిన Tellam Balaraju

ABN , First Publish Date - 2022-05-11T14:39:20+05:30 IST

అసాని(Asani) తుఫాను ప్రభావంతో బలమైన గాలులుతో కూడిన వర్షం పడుతున్న కారణంగా ఈ రోజు పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు(Tellam Balaraju) నియోజకవర్గంలో..

తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సూచనలు చేసిన Tellam Balaraju

ఏలూరు : అసాని(Asani) తుఫాను ప్రభావంతో బలమైన గాలులుతో కూడిన వర్షం పడుతున్న కారణంగా ఈ రోజు పోలవరం ఎమ్మెల్యే  తెల్లం బాలరాజు(Tellam Balaraju) నియోజకవర్గంలో పర్యటించి అధికారులు, నాయకులు, పార్టీ కార్యకర్తలకు ఈ తుఫానును ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా సమర్థంగా ఎదుర్కొనేందుకు పలు సూచనలు చేశారు. పోలవరం(Polavaram) నియోజకవర్గంలో ఉన్న రెవెన్యూ(Revenue), పోలీస్, పంచాయతీ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులు, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైసీపీ కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉండాలని బాలరాజు సూచించారు. వీరంతా ప్రజలను అప్రమత్తం చేసి తుఫాను కారణంగా నష్టపోకుండా చూడాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి పరిస్థితిని బట్టి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. రైతులు పొలాల్లో ఉన్న పంటను భద్రపర్చుకునే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కాజ్ వేలు, ప్రమాదకర వంతెనల వద్ద పికెట్ ఏర్పాటు చేయాలని తెల్లం బాలరాజు తెలిపారు. అత్యవసర వాహనాలు, అంబులెన్స్‌లు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఎక్కడైనా రహదారులపై చెట్లు, వృక్షాలు కూలిపోవడంతో తక్షణమే రహదారి రాకపొకలకు అనుకూలంగా వాటిని తొలగించాలన్నారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. అందరూ సమిష్టిగా పనిచేసి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చూసుకోవాలని తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు.

Read more