తమిళనాడు బీసీ కమిషన్ తో సమావేశమైన తెలంగాణ బీసి కమిషన్

ABN , First Publish Date - 2022-05-12T00:26:19+05:30 IST

స్ధానిక సంస్ధల ఎన్నకల్లో బీసీరిజర్వేషన్లశాతం నిర్ణయించడంలో పాటించాలి్సన విధి విధానాల రూపకల్పనలో భాగంగా తెలంగాణ బీసీ కమిషన్ తమిళనాడు బీసీ కమిషన్ తో భేటీ అయ్యింది

తమిళనాడు బీసీ కమిషన్ తో సమావేశమైన తెలంగాణ బీసి కమిషన్

హైదరాబాద్: స్ధానిక సంస్ధల ఎన్నకల్లో బీసీరిజర్వేషన్లశాతం నిర్ణయించడంలో పాటించాలి్సన విధి విధానాల రూపకల్పనలో భాగంగా తెలంగాణ బీసీ కమిషన్ తమిళనాడు బీసీ కమిషన్ తో భేటీ అయ్యింది. తెలంగాణ బీసీ కమిషన ఛైర్మన్ వకెుళాభవరణం క`ష్ణమోహన్ రావు(vakula bharanam krishna mohan rao)సారధ్యంలో సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కిషోర్ గౌడ్ కూడిన ప్రతినిధుల టీమ్ తమిళనాడు బీసీ ఛైర్మన్ జస్టిస్ ఎం.తనికాచలం, సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సుప్రీం,హైకోర్టు ఇచ్చిన తీర్పుల దరమిలా ఉత్పన్నమైన అంశం పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులలోని టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నేపథ్యంగా తెలంగాణ బీసీ కమిషన్ ఈ అధ్యయనం మొదలుపెట్టింది. 


బుధవారం చెన్నై చేరుకున్న తెలంగాణ ప్రతినిధుల టీమ్ మధ్యాహ్నం 3గంటలకు రామక`ష్ణ కుమార్ రోడ్ , మైలాపూర్ లో ఉన్న తమిళనాడు బీసీ కమిషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ భేటీలో సుదీర్ఘంగా అనేక అంశాలపై దశల వారీగా చర్చించారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిస్ధాయి కుల గణన చేపట్టిన అక్కడి బీసీ కమిషన్ ల అధ్యయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచార సేకరణతో పాటుగా ప్రభుత్వ ఉత్తర్వులను, నివేదికలను, న్యాయ స్ధానాల తీర్పుల ప్రతులను సేకరించారు. 


Read more