పల్నాడు: జిల్లాలోని నరసరావుపేటలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైతు సమస్యలపై నేడు కలెక్టర్‌ను కలిసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యారు. జిల్లా స్థాయిలో తెలుగు తమ్ముళ్లు హజరుకానున్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు తెలుగు దేశం పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జి.వి. ఆంజనేయులు, నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జ్ అరవింద్ బాబులను గృహ నిర్బంధం చేశారు. కాగా పోలీసులు తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి