ఈనెల5న పోలీసు ఉద్యోగాల బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావుచే స్పెషల్ లైవ్

ABN , First Publish Date - 2022-05-04T23:38:12+05:30 IST

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావుతో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో శైలేష్ రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఈనెల5న పోలీసు ఉద్యోగాల బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావుచే స్పెషల్ లైవ్

హైదరాబాద్: తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావుతో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లలో ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సీఈవో శైలేష్ రెడ్డి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పొలీసు శాఖలోని వివిధ విభాగాలకు సంబంధించిన ఎస్.ఐ., కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన దృష్ట్యా పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 5వ తేదీన 11 గంటల నుండి టి-సాట్ నిపుణ ఛానల్ లో ప్రత్యేక లైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడంచారు. పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియలో అపార అనుభవం కలిగిన బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు టి-సాట్ స్టూడియోకు హాజరై పోటీ పరీక్షలు ఎదుర్కొనే అభ్యర్థుల సందేహాలకు సమాధానాలివ్వనున్నారని, అభ్యర్థులు తమ తమ సందేహాలకు సమాధానాలు పొందేందుకు 040-23540326, 23540726 టోల్ ఫ్రీ నెంబర్1800 425 4039 కు కాల్ చేయాలని సూచించారు.


తెలంగాణ ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల కాలంలో 2016,18 నోటిఫికేషన్లలో రెండు విడతలుగా సుమారు 30,000 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసిందని, ప్రస్తుతం 2022 నోటిఫికేషన్ సందర్భంగా 16,887 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించిందని సీఈవో శైలేష్ రెడ్డి వెల్లడించారు. పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం టి-సాట్ నిపుణ ఛానల్ లో ఉదయం ఎనిమిది నుండి 10 గంటల వరకు, విద్య ఛానల్ లో సాయంత్రం ఎనిమిది నుండి 10గంటల వరకు ప్రత్యేక పాఠ్యాంశ ప్రసారాలు ఈ నెల ఐదవ తేదీ నుండి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష పూర్తయ్యే వరకు ఈ ప్రసారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. గంట పాటు మనోమిత్ర పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు మెంటల్ హెల్త్ లో భాగంగా మనోమిత్ర కార్యక్రమాన్ని ఈ నెల ఐదవ తేదీ నుండి నిపుణ ఛానల్ లో సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు గంట పాటు ప్రసారం చేస్తున్నట్లు శైలేష్ రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నాం 12 నుండి ఒంటి గంట వరకు పున: ప్రసారం అవుతాయన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులకు వివిధ స్థాయిల్లో టి-సాట్ నెట్వర్క్ అందించే ప్రసారాల సేవలను సద్వినియోగం చేసుకొని విజయాలు సాధించాలని సీఈవో శైలేష్ రెడ్డి సూచించారు.

Read more