భాగ్యనగరంలో ఎండలు తగ్గిపోయాయ్..!

ABN , First Publish Date - 2022-05-06T18:24:38+05:30 IST

గ్రేటర్‌లో ఎండ తీవ్రత తగ్గింది. వారం రోజులపాటు భగభగమండిన భానుడితో అల్లాడిపోయిన నగరవాసులు..

భాగ్యనగరంలో ఎండలు తగ్గిపోయాయ్..!

  • వర్షంతో 4 డిగ్రీలు పడిపోయిన ఉష్ణోగ్రతలు


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో ఎండ తీవ్రత తగ్గింది. వారం రోజులపాటు భగభగమండిన భానుడితో అల్లాడిపోయిన నగరవాసులు బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో ఉపశమనం పొందారు. నాలుగు రోజుల క్రితం వరకు రోజుకు సగటున 41 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 4 డిగ్రీలకు పడిపోయాయి. గురువారం గరిష్ఠంగా 37.6, కనిష్ఠం 24.0 డిగ్రీలు నమోదైనట్లు బేగంపేట వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతోందని, రాత్రివేళల్లో గ్రేటర్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

Read more