AP: భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

ABN , First Publish Date - 2022-05-06T17:56:45+05:30 IST

భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. పోర్టు వద్దు అంటూ సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామస్తులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

AP: భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస

శ్రీకాకుళం: జిల్లాలో నిర్వహించిన భావనపాడు పోర్టు ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. పోర్టు వద్దు అంటూ సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రామస్తులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం  భావనపాడు పోర్ట్ కోసం జిల్లా కలెక్టర్, అధికారులు భూసేకరణ, ప్రజా అభిప్రాయం సేకరణ సభ నిర్వహించారు. అయితే పోర్టు  నిర్మాణం వల్ల జీవనోపాధి కోల్పోతామని స్థానికులు చెబుతున్నారు. ఉప్పు రైతులు, చేపల వేటకు వెళ్లే వాళ్ళు జీవనోపాధికి నష్టం ఏర్పడుతుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో పోర్టు వద్దు అని  ప్రజలు తేల్చి చెప్పారు. 

Read more