ములుగు జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపు

ABN , First Publish Date - 2022-05-03T15:38:54+05:30 IST

జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపులకు పాల్పడుతోంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల పేరుతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టింది.

ములుగు జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపు

ములుగు: జిల్లాలో ఇసుక మాఫియా బరితెగింపులకు పాల్పడుతోంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల పేరుతో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టింది. ఏటూరునాగారం శివారులోని దెయ్యాలవాగులో  ఇసుక వ్యాపారులు ఇసుక క్వారీని ఏర్పాటు చేశారు. గోదావరి వరద ముప్పు నుంచి గ్రామ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టను తవ్వి భారీ గుంతలు తీస్తున్నారు. ఇసుక తీయడం వల్ల గ్రామానికి ముంపు ఉందని ఇసుక క్వారీ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పట్టా భూమిలో పర్మిషన్ పేరుతో అక్రమంగా నడివాగులో ఇసుక వ్యాపారులు ఇసుక తవ్వకాలు చేపట్టారు. వాగులో భారీ ఇసుక గుంతలతో కరకట్టకు ముప్పు పొంచి ఉందని క్వారీని నిలిపివేయాలంటూ గ్రామస్తులు ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ టీఎస్‌ఎమ్‌డీసీ, రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Read more