రెవెన్యూ లీలలెన్నో

ABN , First Publish Date - 2022-05-10T05:21:03+05:30 IST

ప్రభుత్వ భూములకు ఆనలైన రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు మార్చడం..

రెవెన్యూ లీలలెన్నో
దేవనకొండ మండలం తహసీల్దారు కార్యాలయం

  1. ఆనలైన నమోదులో మాయాజాలం
  2. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములు
  3. జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో..

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములకు ఆనలైన రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లు మార్చడం.. దేవుని మాన్యాలను అన్యాక్రాంతం చేయడం.. భూములు లేకున్నా ఆనలైనలో ఉన్నట్లు రికార్డులు సృష్టించడం.. వెబ్‌ల్యాండ్‌ మహాత్యం వల్ల కొందరు రెవెన్యూ అధికారులు చేస్తున్న చిత్రాలెన్నో.! కాసుల కక్కుర్తి కోసం రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూములు, కొండలను పరాధీనం చేస్తున్నారు. దేవనకొండ 158 ఎకరాల ఘటన వెలుగులోకి వచ్చిందో లేదో.. తాజాగా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో వంక పోరంబోకును వైసీపీ కార్యకర్తలకు కట్టాబెట్టారని స్పందనలో కొందరు ఫిర్యాదు చేశారు. 

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ప్రభుత్వ, దేవదాయ, అటవీ శాఖ, బంజరు, చెరువులు, కుంటలు, నాలాలు, వంక పోరంబోకు, ప్రైవేటు భూములు.. 7.50 లక్షల ఖాతాల పరిధిలో 17.658 లక్షల హెక్టార్లు ఉన్నాయి. అందులో సాగు భూములు 9.17 లక్షల హెక్టార్లు ఉన్నాయి. అటవీ శాఖ భూములు 3.406 లక్షల హెక్టార్లు ఉంటే.. కొండలు, ప్రభుత్వ మిగులు భూములు, పోరంబోకు, బంజరు, వంక పోరంబోకు వంటి వివిధ రకాల భూములు 5.082 లక్షల హెక్టార్లు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ద్వారా తెలుస్తోంది. కాగా భూములను డిజిటలైజేషన చేయాలనే లక్ష్యంగా 2019 అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ భూ రికార్డుల స్వచ్ఛీకరణకు శ్రీకారం చుట్టింది. 2021 జనవరి వరకు ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ప్రకారం వెబ్‌ల్యాండ్‌ నమోదును వేగవంతం చేసింది. అయితే ఆనలైన ప్రక్రియలో లోపాలు కొందరు అధికారులకు కాసుల పంటగా మారింది. కొందరు తహసీల్దార్లు తమకు ఇచ్చిన డిజిటల్‌ కీ నిదుర్వినియోగం చేసి రూ.లక్షలు విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

 డిజిటల్‌ కీ దుర్వినియోగం: 

భూ క్రయ విక్రయాలు జరిగినా.. అన్నదమ్ములు విభాగ దస్తావేజులు రాసుకొని రిజిసే్ట్రషన చేసుకున్నా అలాంటి భూములను ఆనలైనలో నమోదు చేయాలంటే తహసీల్దారును ఆశ్రయించాల్సిందే. వెబ్‌ల్యాండ్‌ భూ రికార్డుల తప్పుల సవరణ తహసీల్దారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉంది. ఇందుకోసం తహసీల్దారులకు డిజిటల్‌ కీ ఇచ్చింది. అయితే తమకు ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి రాత్రికి రాత్రే వెబ్‌ల్యాండ్‌లో రికార్డులు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

  కంప్యూటర్‌ ఆపరేటర్‌కు సాధ్యమా..?:

దేవనకొండ మండలం గుండ్లకొండ, వెలమకూరు గ్రామాల్లో భూముల ధారాదత్తంపై కంప్యూటర్‌ ఆపరేటర్‌ తన డిజిటల్‌ కీ దుర్వినియోగం చేశారని తహసీల్దారు ఇంద్రాణి చెబుతున్నారు. అయితే రెవెన్యూ అధికారుల సహకారం లేనిదే ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆనలైన రికార్డులు మార్చగలరా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ  ఘటన మరువక ముందే ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో సర్వే నంబరు 80, 148, 40, 41 పరిధిలోని ప్రభుత్వ భూములను ఆనలైన రికార్డుల్లో అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకుల పేర్లు మార్చాని సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో గ్రామస్థులు ఫిర్యాదు చేయడం గమనార్హం ఆర్‌ఎస్‌ఆర్‌ రికార్డుల ప్రకారం గ్రామ కంఠం, వంక పోరంబోకు, వ్మశానం భూములు ఉన్నాయి. అఽధికార పార్టీ నాయకులు కొందరు ఆక్రమించుకొని అమ్ముకుంటే.. ఆ భూములను రెవెన్యూ అధికారులు ఆనలైన రికార్డుల్లో అధికార పార్టీ నాయకుల చూపిన పేర్లు మార్చారని ప్రధాన ఆరోపణ. 

  జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలు కొన్ని: 

 ఆలూరు మండలం మొలగవెళ్లి గ్రామంలో సర్వే నంబరు 894/డీ, 864/డీ పరిధిలో భూములే లేకున్నా 9.80 ఎకరాల భూమి ఉన్నట్లు ఆనలైన అడంగల్‌లో పేర్చు చేర్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో తహసీల్దారు, వీఆర్‌వో సస్పెన్షనకు గురయ్యారు. 

గూడూరు మండలం పొన్నకల్‌ గ్రామంలో దేవాలయానికి చెందిన రూ.లక్షల విలువ చేసే ఎకరం భూమిని ఆనలైన రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తి పేరున మార్చారు. దీనిపై తహసీల్దారు, కలెక్టరేట్‌ కార్యాలయాల వద్ద గ్రామస్థులు ఆందోళన చేయడంతో ఆ తరువాత ఆనలైనలో తొలగించారు. 

కర్నూలు మండలం నిడ్జూరులో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన అనుచరుల పేరున ఆనలైనలో మార్చారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. 

ఫ ఆదోని మండలం ఆనవాళ్ల గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన 49.50 ఎకరాల దేవాలయ భూమిని ఓ రెవెన్యూ అధికారి తొమ్మిది మంది పేర్లపై మార్చి పట్టాదారు పాసు పుస్తకాలు కూడా ఇచ్చారని ఆ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశారు. రికార్డులు మార్చిన అధికారి సస్పెన్షన వేటుకు గురయ్యారు.

 పత్తికొండ పట్టణంలో రూ.లక్షల విలువ చేసే నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకుల పేరున ఆనలైన మార్చారు. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అదే మండలంలోని హోసూరు గ్రామంలో ఓ నిరుపేద మహిళలకు ఇచ్చిన డీకేటీ పట్టా భూమిని ఆమెకు తెలియకుండా వీఆర్‌ఏల పేరున మార్చారు. బాధితురాలు ధర్నా చేయడంతో ఆ వీఆర్‌ఏలను సస్పెండ్‌ చేశారు. 

 

Read more