పెళ్లిలో ఫొటో కోసం పోటీ.. చివరకు ఎంత పెద్ద గొడవ జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-14T17:51:39+05:30 IST

సాధారణంగా పెళ్లి వేడుకల్లో ఏర్పాట్లు, ఇతర విషయాల్లో అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తుంటాయి.

పెళ్లిలో ఫొటో కోసం పోటీ.. చివరకు ఎంత పెద్ద గొడవ జరిగిందంటే..

సాధారణంగా పెళ్లి వేడుకల్లో ఏర్పాట్లు, ఇతర విషయాల్లో అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో పెళ్లికి హాజరైన బంధుమిత్రులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి పెళ్లి వేడుక జరిపిస్తుంటారు. అయితే జార్ఖండ్‌లో జరిగిన ఓ పెళ్లిలో బంధువుల వల్లే గొడవ జరిగింది. వధూవరులతో ముందు ఎవరు ఫొటో దిగాలనే విషయంలో మొదలైన గొడవ ఇటుకలు, రాళ్లు, కర్రలతో కొట్టుకునే వరకు వచ్చింది. 


గిరిదిహ్ జిల్లాలోని మీర్జాగంజ్‌‌లో వైభవంగా వివాహం జరుగుతోంది. ఆ వేడుకకు ఇరు వర్గాల వారు భారీగా హాజరయ్యారు. రిసెప్షన్ సమయంలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురుతో ఫోటో దిగేందుకు పోటీపడ్డారు. ముందు మేము అంటే మేమంటూ గొడవకు దిగారు. కేవలం ఫోటో కోసం అమ్మాయి, అబ్బాయి తరఫు బంధువులు పోటీ పడ్డారు. అక్కడే వివాదం రాజుకుంది. ముందు ఆడవాళ్ల దగ్గర మొదలైన ఫైటింగ్‌ చివరకు మగవాళ్లు తన్నుకునే వరకు వచ్చింది. ఆ గొడవ అలా పెరిగి తలకాయలు పగిలేలా కొట్టుకున్నారు. 

Read more