-
-
Home » Andhra Pradesh » rains in coastal areas of bapatla due to cyclone andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
APnews: తుఫాన్ ప్రభావంతో బాపట్ల తీర ప్రాంతాల్లో వర్షాలు
ABN , First Publish Date - 2022-05-11T13:29:49+05:30 IST
అసాని తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి.
బాపట్ల: అసాని తుఫాన్(Asani cyclone) ప్రభావంతో బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. రేపల్లె , నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో భారీ వర్షం పడుతోంది. తుపాను తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. నిజాంపట్నం హార్బర్లో 8వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అలాగే బాపట్ల కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెo.8712655878, 8712655881, 8712655918. జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు అయ్యాయి. అటు సముద్ర తీర ప్రాంతాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.