యూకో బ్యాంక్‌ లాభంలో 290% వృద్ధి

ABN , First Publish Date - 2022-05-14T08:28:41+05:30 IST

యూకో బ్యాంక్‌ లాభంలో 290% వృద్ధి

యూకో బ్యాంక్‌ లాభంలో 290% వృద్ధి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): యూకో బ్యాంక్‌.. మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.312 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.80 కోట్లతో పోలిస్తే 290 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ వెల్లడించింది. 2021-22 ఏడాది మొత్తానికి రూ.930 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది లాభం రూ.167 కోట్లతో పోలిస్తే 457 శాతం పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ.1,652 కోట్లకు, మొత్తం ఏడాదికి రూ.6,473 కోట్లకు చేరిందని పేర్కొంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022 మార్చి చివరి నాటికి బ్యాంక్‌  మొత్తం వ్యాపా రం 9.1 శాతం వృద్ధితో రూ.3,24,324 కోట్ల నుంచి రూ.3,53,850 కోట్లకు చేరింది. 

Read more