పీఆర్‌ఎల్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌

ABN , First Publish Date - 2022-05-02T21:34:02+05:30 IST

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ ఆధ్వర్యంలోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబరేటరీ (పీఆర్‌ఎల్‌) - జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 12 జేఆర్‌ఎ్‌ఫలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లో రెండు సెమిస్టర్ల కోర్సు వర్క్‌ ఉంటుంది. దీనిని...

పీఆర్‌ఎల్‌ జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌

కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ ఆధ్వర్యంలోని ఫిజికల్‌ రిసెర్చ్‌ ల్యాబరేటరీ (పీఆర్‌ఎల్‌) - జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 12 జేఆర్‌ఎ్‌ఫలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లో రెండు సెమిస్టర్ల కోర్సు వర్క్‌ ఉంటుంది. దీనిని పూర్తిచేసిన వెంటనే పీహెచ్‌డీకి రిజిస్టర్‌ చేసుకోవచ్చు. అకడమిక్‌ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.31,000ల ఫెలోషిప్‌ చెల్లిస్తారు. 

విభాగాలు: ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రో ఫిజిక్స్‌, అటామిక్‌ - మాలిక్యులర్‌ - ఆప్టికల్‌ ఫిజిక్స్‌, జియో సైన్సెస్‌, థియరిటికల్‌ ఫిజిక్స్‌

అర్హత: ఫిజిక్స్‌/ ఇంజనీరింగ్‌ ఫిజిక్స్‌/ స్పేస్‌ ఫిజిక్స్‌/ అట్మాస్ఫిరిక్‌ సైన్సెస్‌/ జియాలజీ/ జియోఫిజిక్స్‌/ రిమోట్‌ సెన్సింగ్‌ విభాగాల్లో బ్యాచిలర్స్‌ + మాస్టర్స్‌ డిగ్రీలు పూర్తిచేసినవారు దరఖాస్తు  చేసుకోవచ్చు. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. ఆగస్టు నాటికి మాస్టర్స్‌ పూర్తిచేసేవారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. గత రెండేళ్లలో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులైనవారికి; ఫండమెంటల్‌ ఫిజిక్స్‌, మేథమెటిక్స్‌ విభాగాల్లో పూర్తి పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫిజికల్‌ సైన్సెస్‌/ కెమికల్‌ సైన్సెస్‌/ ఎర్త్‌ - అట్మాస్ఫిరిక్‌ - ఓషన్‌- ప్లానెటరీ  సైన్సెస్‌/ ఫిజిక్స్‌/ జియాలజీ/ జియోఫిజిక్స్‌/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌ విభాగాల్లో సీఎ్‌సఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ (2020/ 2021 జూన్‌ సెషన్‌)/ యూజీసీ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ (2020/ 2021 జూన్‌ సెషన్‌)/ గేట్‌ (2020/ 2021/2022)/ జెస్ట్‌ (2021/2022) అర్హత పొంది ఉండాలి. అభ్యర్థులకు జూలై 1 నాటికి 28 ఏళ్లు మించకూడదు.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 20

ఇంటర్వ్యూలు: జూన్‌ 6, 7, 8

వెబ్‌సైట్‌: www.prl.res.in/prl-eng/phd

Read more