ఈదురుగాలుల బీభత్సం.. పలు రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-05-06T03:32:13+05:30 IST

జిల్లాలో ఈదురు గాలుల బీభత్సం సృష్టించింది. కోమరాడ మండలం గుమడ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై భారీ వృక్షం కూలింది. పార్వతీపురం నుంచి..

ఈదురుగాలుల బీభత్సం.. పలు రైళ్ల రద్దు

పార్వతీపురం మన్యం: జిల్లాలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించింది. కోమరాడ మండలం గుమడ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌పై భారీ వృక్షం కూలింది.  పార్వతీపురం నుంచి రాయగడ రూట్‌లో వెళ్లే పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు రద్దు అయింది. 4 ప్యాసింజర్ రైళ్లు, 2 స్పెషల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ట్రాక్‌పై పడిన చెట్టును తొలగించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు తెలిపింది. 

Read more