Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 13 May 2022 18:43:13 IST

పెళ్లి విందుకు పిలవలేదని పక్కింటి వ్యక్తుల నిర్వాకమిది.. నేరుగా భోజనాల వద్దకు వెళ్లి..

twitter-iconwatsapp-iconfb-icon
పెళ్లి విందుకు పిలవలేదని పక్కింటి వ్యక్తుల నిర్వాకమిది.. నేరుగా భోజనాల వద్దకు వెళ్లి..

కొన్నిసార్లు ఈగో కారణంగా చిన్న గొడవలు కూడా చాలా పెద్దవి అవుతుంటాయి. తీరా చివరకు విచారిస్తే కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి. ఇలాంటి ఘటనే గ్వాలియర్‌లో జరిగింది. పెళ్లి విందుకు పిలవకపోవడాన్ని పక్కింటి వ్యక్తులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా తన కోపాన్ని చూపించాలనుకున్నాడు. నేరుగా భోజనాల వద్దకు వెళ్లి అతడు చేసిన నిర్వాకం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. గ్వాలియర్‌లోని నాకా చంద్రబద్ని ప్రాంతంలో కదం సింగ్ అనే వ్యక్తి.. తన కుమారుడు లోకేంద్ర వివాహ కార్యక్రమం సందర్భంగా మే 11న రిసెప్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు, సన్నిహితులను అందరినీ ఆహ్వానించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అందరినీ ఆహ్వానించిన కదం సింగ్.. ఇరుగుపొరుగున ఉండే దిలీప్, సోను, ప్రమోద్, జితేంద్ర తదితరులను మాత్రం విస్మరించాడు. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే తమను విందుకు పిలవకుండా అవమానించారని భావించారు. ఎలాగైనా కార్యక్రమాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నారు. విందులో అంతా భోజనాలకు సిద్ధంగా ఉండగా.. లోపలికి ప్రవేశించారు.

అసలు వీళ్లు తల్లిదండ్రులేనా..? 11 ఏళ్ల కొడుకు ఉన్న గదిలోకి 22 శునకాలను పంపించి.. రెండేళ్లుగా..

లోపలికి వెళ్లీ వెళ్లగానే కోపంతో అక్కడున్న సామాన్లను విసిరికొట్టారు. భోజన పదార్థాలను చెల్లాచెదురుగా పడేశారు. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. స్థానికులు కొందరు కలుగజేసుకుని సర్దిచెప్పడంతో అప్పటికి వెళ్లిపోయారు. అయితే గురువారం వరుడి ఊరేగింపు కార్యక్రమానికి చేరుకుని మళ్లీ గొడవ సృష్టించారు. వరుడిని రథంపైకి ఎక్కకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో వరుడి కుటుంబ సభ్యులు నేరుగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు పోలీసులను పంపించి, దగ్గరుండి కార్యక్రమాన్ని నిర్వహించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భర్త మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న భార్య.. కోడలి ప్రవర్తనపై అత్తింట్లో డౌట్.. పోస్ట్‌మార్టం చేయిస్తే..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఫార్ములా వన్ వెహికల్‌లో దూసుకెళ్తున్న యువకుడు.. ఆ వాహనంతో ఇతడు చేస్తున్న వ్యాపారం ఏంటో తెలిస్తే అవాక్కవుతారు.. videoసివిల్ ఇంజనీర్‌ జాబ్‌కు గుడ్‌బై.. ఇప్పుడు రోజుకు 6 వేల సంపాదన.. ఇంతకీ ఇతడు చేస్తున్న పనేంటంటే..అంబులెన్స్‌లో నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణి.. ఎదురుగా రోడ్డుకు అడ్డంగా ఏనుగు.. చివరకు..కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా ఊహించని ఘటన.. పెళ్లి మంటపంలో కలకలం.. వరుడికి మైండ్‌బ్లాక్..!ప్రియుడికి వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్.. పెట్రోల్‌ బాటిల్‌తో సహా ఆ ప్రేయసి నేరుగా అతడి ఇంటికెళ్లి..కూతురి పీకలమీదకు తెచ్చిన తండ్రి నిర్వాకం.. ఆమెను ప్రేమిస్తున్న కుర్రాడి వద్ద అప్పు తీసుకుని..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.