తీగలాగితే డొంక కదిలింది.. నారాయణ అరెస్ట్‌ రాజకీయ కక్ష కాదు: సజ్జల

ABN , First Publish Date - 2022-05-11T03:00:14+05:30 IST

తీగలాగితే డొంక కదిలింది.. నారాయణ అరెస్ట్‌ రాజకీయ కక్ష కాదు: సజ్జల

తీగలాగితే డొంక కదిలింది.. నారాయణ అరెస్ట్‌ రాజకీయ కక్ష కాదు: సజ్జల

అమరావతి: Tenth ప్రశ్నపత్రం LEAK CASEలో నారాయణ అరెస్ట్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తీగలాగితే డొంక కదిలిందని, 100కు 120 మార్కులు తెచ్చుకునే విధంగా వ్యవహరించారని ఆరోపించారు. నారాయణ అరెస్ట్‌ వెనక రాజకీయ కక్ష లేదని సజ్జల అన్నారు. విద్యా వ్యవస్థకు కొంతమంది చీడపురుగుల్లా తయారయ్యారని విమర్శించారు. కుంభకోణాలపై జగన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని సజ్జల తెలిపారు. ఉపాధ్యాయ వ్యవస్థకు మచ్చతెచ్చేలా మాజీ మంత్రి నారాయణ వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని సజ్జల అన్నారు.

Read more