అమరావతి: ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆందళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, విశాఖలో ఏవో జరిగాయంటూ.. జగన్‌రెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడారని తప్పుబట్టారు. ఆడబిడ్డలను అవమానించేలా జగన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. అత్యాచార బాధితులకు డబ్బులిచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆనంద్‌బాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి