మైనర్ బాలికను అగ్నికి ఆహుతి చేసిన కేసులో.. తల్లి, అమ్మమ్మకు జీవిత ఖైదు

ABN , First Publish Date - 2022-05-09T09:20:55+05:30 IST

కూతురితో గొడవ పడి, కోపంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిందో తల్లి. ఆ అమ్మాయి అమ్మమ్మ కూడా దీనికి సహకారం అందించింది...

మైనర్ బాలికను అగ్నికి ఆహుతి చేసిన కేసులో.. తల్లి, అమ్మమ్మకు జీవిత ఖైదు

కూతురితో గొడవ పడి, కోపంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టిందో తల్లి. ఆ అమ్మాయి అమ్మమ్మ కూడా దీనికి సహకారం అందించింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో వెలుగు చూసింది. 

స్థానికంగా నివసించే ఇక ఇంట్లో తల్లి, అమ్మమ్మతో కలిసి ఒక మైనర్ బాలిక నివశిస్తోంది. ఏడేళ్ల క్రితం 2015 జులై 8న తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగ్గో అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ బాధతోనే తన కుమార్తె కిరోసిన్ పోసుకొని చనిపోయిందని ఆ తల్లి వాపోయింది. అయితే దర్యాప్తు సమయంలో పోలీసులకు వేరే నిజాలు తెలిశాయి. బాలికతో గొడవ పడిన అమ్మ, అమ్మమ్మ కలిసి.. ఆమెను హత్య చేశారని వెల్లడైంది. దీంతో వాళ్లిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 


దీనిపై విచారణ జరిపిన పోక్సో కోర్టు.. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొన్న జగ్గోను నిరపరాధిగా భావించి విడుదల చేసింది. అలాగే బాలికను హత్య చేసిన అమ్మ, అమ్మమ్మ ఇద్దరికీ జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం 25 మంది సాక్షుల వాంగ్మూలాలు విని, 40 రకాల పత్రాలు పరిశీలించిన కోర్టు.. ఈ సంచలన తీర్పు వెల్లడించింది.

Read more