MMTS ఫస్ట్‌ క్లాస్‌ చార్జీలు 50% వరకు తగ్గింపు

ABN , First Publish Date - 2022-05-03T22:46:03+05:30 IST

హైదరాబాద్: MMTS (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసు) ఫస్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ జర్నీ ప్రయాణికుల కోసం 50% వరకు చార్జీలు తగ్గించారు.

MMTS ఫస్ట్‌ క్లాస్‌ చార్జీలు 50% వరకు తగ్గింపు

హైదరాబాద్: MMTS (మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసు) ఫస్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ జర్నీ ప్రయాణికుల కోసం 50% వరకు చార్జీలు తగ్గించారు. సబర్బన్‌ రైళ్ల సర్వీసులలో ఫస్ట్‌ క్లాస్‌ చార్జీల తగ్గింపును 5 మే 2022 నుండి అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్లలోని సబర్బన్‌ సెక్షన్లలో MMTS రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సింగిల్‌ జర్నీ ఫస్ట్‌ క్లాస్‌ చార్జీలు తగ్గిస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ ప్రయాణికులకు సూచించారు.




ప్రస్తుతం ఫలక్‌నుమా ` సికింద్రాబాద్‌ ` హైదరాబాద్‌ ` బేగంపేట ` లింగంపల్లి ` తెల్లాపూర్‌ ` రామచంద్రాపురం మధ్య 29 రైల్వే స్టేషన్లను కవర్‌ చేస్తూ 50 కిమీల మీదుగా 86 ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసులున్నాయి. 

Read more