తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి: మంత్రి Talasani

ABN , First Publish Date - 2022-05-08T20:19:13+05:30 IST

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందిస్తున్న కానుక కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Srinivas yadav) అన్నారు.

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి: మంత్రి Talasani

హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అందిస్తున్న కానుక కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్( Srinivas yadav) అన్నారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద 113 మంది లబ్ధిదారులకు  కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ల క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం లక్ష 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. 


తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. ముఖ్యమంత్రి KCR నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మీ, మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, ఉప్పల తరుణి, తహసీల్దార్ లు  విష్ణుసాగర్, బాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Read more