పంచాయితీరాజ్ శాఖ ఆడిటింగ్ లో మరోసారి తెలంగాణ ఫస్ట్

ABN , First Publish Date - 2022-05-02T23:50:19+05:30 IST

కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పంచాయితీరాజ్ శాఖ ఆడిటింగ్ లో దేశంలో మరోసారి మొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది.

పంచాయితీరాజ్ శాఖ ఆడిటింగ్ లో మరోసారి తెలంగాణ ఫస్ట్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పంచాయితీరాజ్ శాఖ ఆడిటింగ్ లో దేశంలో మరోసారి మొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మొదటి స్థానం రావడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని, వారి టీమ్ ను ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 540 మండలాలు, 32 జిల్లా పరిషత్ లు ఉన్న తెలంగాణ రాష్ట్రం వరుసగా రెండో సారి నేషనల్ లీడ్ స్టేట్ గా నిలవడం గర్వించతగ్గ విషయం అన్నారు. దేశంలో 100 శాతం ఆడిట్ సాధించిన మొదటి రాష్ట్రంగా ఉండటం వెనుక రాష్ట్ర అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కృషి ఉందన్నారు.


దేశంలోనే ఆడిటింగ్ లో మొదటి స్థానం రావడానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో అధికారులు బాగా పనిచేశారని అన్నారు. ట్విట్టర్ వేదికగా అభినందించిన మంత్రి కేటీఆర్ కి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు, అవార్డులు ఇచ్చినట్లే నిధులు కూడా ఇవ్వాలని అన్నారు. ఈ ర్యాంకు రావడానికి కృషి చేసిన గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేసిన అధికారులు, ఉద్యోగులకు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.

Read more