ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 56 శాతానికి పెరిగాయి:Harish rao

ABN , First Publish Date - 2022-05-06T20:41:31+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 56 శాతానికిపెరిగిందని, ఇది మరింత పెరిగే అవకాశం వుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 56 శాతానికి పెరిగాయి:Harish rao

హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య 56 శాతానికిపెరిగిందని, ఇది మరింత పెరిగే అవకాశం వుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  కేటీఆర్ కిట్లను అందజేస్తున్నందున పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడ ప్రసవాలకు ప్రాధాన్యతనిస్తున్నారని అన్నారు. శుక్రవారం జంటనగరాల్లోని పలు ప్రభుత్వ ఆసుపత్రులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో రు. 2.15 కోట్ల విలువ చేసే సిటీ స్కాన్ ను ప్రారంభించారు. అలాగే కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు. 


ఇదే ఆసుపత్రిలో ఆధునాతన సిటీ స్కాన్ ప్రారంభించారు.సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో సర్జికల్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కోటి ENT hospital ఎక్స్పర్ట్ గా నిలిచిందన్నారు.ఓల్డ్ బిల్డింగ్ కులిపోతు ఉంది.డాక్టర్ పోస్ట్ లు కావాలన్నారు. త్వరలోనే కొత్త నియామకాలు జరుగుతాయన్నారు. అలాగే 35 కోట్లతో లక్ష sft building నిర్మించడానికి ప్రభుత్వం పూనుకుంటుందన్నారు. 110 బెడ్స్, 8 ఆపరేషన్ థియేటర్స్ తో బిల్డింగ్ కడుతున్నామని చెప్పారు. సుల్తాన్ బజార్ కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో రోగుల తాకిడి పెరిగింది . కానీ ఇక్కడ యూనిట్స్ తక్కువ ఉన్నాయని,పెట్ల బురుజు , నిలోఫర్ నుంచి కొన్ని యూనిట్స్ ను ఇక్కడకు తెప్పిస్తమని మంత్రి తెలిపారు. శానిటేషన్ కు ప్రతి నెలకు ఒక బెడ్ మీద 5 వేలు ఇచేవాళ్ళము.. ఇప్పుడు 7500 కి పెంచమని చెప్పారు. 


200 కోట్లు శానిటేషన్ కు ఖర్చు చేస్తున్నామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశధ్యం మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌, కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రి, సుల్తాన్‌బజార్ మెటర్నిటీలో పలు వైద్య సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. జంట నగరాల్లో18 హాస్పిటల్స్ లలో ఈ నెల 12న ఉచితంగా భోజనం కార్యక్రమం ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. 5 రూపాయిల మీల్స్ .. మూడు పూటలా అందుబాుటులో వుంటుందన్నారు. ప్రస్తుతం నిజాం కాలంలో పెట్టిన హాస్పిటల్స్ తో వైద్యం అందిస్తున్నాం.ఇప్పుడు కేసీఆర్ హయాంలో కొత్త హాస్పిటల్స్ వస్తున్నాయని మంత్రి తెలిపారు. టి డయాగ్నొస్టిక్, బస్తి దవాఖానాలకు ప్రజల నుంచి ఆదరణ పెరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూఅవయవాల మార్పిడి చికిత్సలు ఉచితంగా జరుగుతున్నాయని తెలిపారు. 

Read more