ప్రైవేటుకు దీటుగా వైద్యసేవలందించాలి

ABN , First Publish Date - 2022-05-14T07:23:46+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని, నూరుశాతం ప్రసవాలన్నీ ఆసుపత్రిలో జరిగేవిధంగా చూడాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు.

ప్రైవేటుకు దీటుగా వైద్యసేవలందించాలి

కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి 

నిజామాబాద్‌అర్బన్‌, మే 13: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని, నూరుశాతం ప్రసవాలన్నీ ఆసుపత్రిలో జరిగేవిధంగా చూడాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్‌ శాఖల ఉద్యోగులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం వల్ల ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఎక్కువగా కాన్పులు అవుతున్నాయని ఆయన తెలిపారు. సిజేరియన్‌లు ఎక్కువగా ప్రైవేట్‌ ఆసుపత్రిలో జరుగుతున్నాయన్నారు. వీటిని తగ్గించాలన్నారు. రాష్ట్ర సగటు 66శాతం ఉంటే జిల్లాలో 77శాతం సిజేరియన్‌ ఆపరేషన్‌లు జరుగుతున్నాయన్నారు. జిల్లా లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో 92శాతం సిజేరిజయన్‌లు చేస్తున్నారని ఆందోళన వెల్లిబుచ్చారు. సిజేరియన్‌ వల్ల మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. సిజేరియన్‌ తగ్గించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు ప్రభు త్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేవిధంగా చూడాలన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారి జీతం లో వెయ్యి రూపాయలు కోత విధిస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సీ వైద్యు లు అందుబాటులో ఉన్నారని తెలిపారు. అనాథ బాలలు, వృద్ధులు, అత్యాచార బాధితులకు సేవలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను కలెక్టర్‌ అభినందించారు. ఈ సమావేశంలో డాక్టర్‌ సుదర్శనం, డీపీవో డాక్టర్‌ జయసుధ, డీఈవో దుర్గాప్రసాద్‌, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధి కారి ఝాన్సీ, మాతా శిశు ఆరోగ్యవిభాగం జిల్లా రప్రోగాం అధికారి డాక్టర్‌ అంజన పాల్గొన్నారు.

Read more