Vijayasaireddy ట్విట్‌కి ఘాటుగా స్పందించిన మాణిక్యం ఠాగూర్
ABN , First Publish Date - 2022-05-04T01:33:35+05:30 IST
విజయసాయిరెడ్డి ట్విట్‌కి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.
ఢిల్లీ: రాహుల్‌గాంధీ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. విజయసాయి రాహుల్‌పై చేసిన ట్విట్‌కి మాణిక్యం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.‘‘అవినీతి విజయసాయిరెడ్డి నిజం తెలుసుకోవాలి. మీ సమస్య జగన్‌రెడ్డిపై ఉన్న అవినీతి కేసులన్నీ మాకు తెలుసు.అందుకు మీరు సాహెబ్‌ని సంతోషంగా ఉంచాలి... కానీ నిజం మర్చిపోకండి. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ నేపాల్ వెళ్లారు.నేపాల్‌కి చెందిన ఖాట్మాండ్ పోస్ట్ పేపర్ క్లిప్‌ను మాణిక్యం ఠాగూర్ విజయసాయిరెడ్డికి టాగ్ చేశారు.వివాహ వేడుకకు హాజరుకావడంలో తప్పేముందని విజయసాయిరెడ్డిని మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్లో ప్రశ్నించారు.