మామిడికాయ రసం

ABN , First Publish Date - 2022-05-07T22:48:33+05:30 IST

మామిడికాయ - ఒకటి, టొమాటో - ఒకటి, కందిపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత,

మామిడికాయ రసం

కావలసిన పదార్థాలు: మామిడికాయ - ఒకటి, టొమాటో - ఒకటి, కందిపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కరివేపాకు - ఒకకట్ట, ఎండుమిర్చి - ఒకటి, మిరియాలు - నాలుగైదు, ధనియాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీ స్పూన్‌, అల్లం వెల్లుల్లి - కొద్దిగా, ఆవాలు - ఒక టీస్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌, నూనె - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు.


తయారు చేయు విధానం: ముందుగా పచ్చిమామిడికాయ పొట్టు తీసి కుక్కర్‌లో వేసి ఉడికించాలి. ఆవిరి పోయాక తీసి గుజ్జును తీసుకుని మిక్సీలో వేసి కొద్దిగా మ్యాంగో ప్యూరీ తయారుచేసుకోవాలి.అలాగే కందిపప్పును ఉడికించుకుని మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.మిరియాలు, ధనియాలను వేయించి పొడి చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. పసుపు, కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి  వేయాలి.తరువాత మ్యాంగో ప్యూరీ, టొమాటో ముక్కలు వేయాలి. మిరియాల పొడి, ధనియాల పొడి వేయాలి. ఉడికించి పెట్టుకున్న పప్పు వేసి కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేయాలి.సరిపడా నీళ్లు పోసి పదినిమిషాల పాటు మరిగించుకుంటే రసం రెడీ.


Read more