వింత ఎన్నికలు.. కాయిన్ టాస్ వేసి విజేత ఎంపిక.. కారణం ఏంటో తెలిస్తే..!

ABN , First Publish Date - 2022-05-09T01:46:25+05:30 IST

ప్రజాస్వామ్య దేశాల ఎన్నికల్లో విజేతలెవరో తేల్చేది ప్రజల ఓట్లే. ఎవరికి ఎక్కువ ఒట్లు వస్తే వారే ఎన్నికల్లో గెలుస్తారు. అనేక సందర్భాల్లో కేవలం కొన్ని ఓట్ల తేడాతోనే విజయం దూరమైపోతుంటుంది. కానీ.. బ్రిటన్‌లోని మాన్‌మౌత్‌షైర్ కౌంటీల్లో జరిగిన ఎన్నికల్లో విజేతను కాయిన్ టాస్ వేసి ఎంపిక చేశారు.

వింత ఎన్నికలు.. కాయిన్ టాస్ వేసి  విజేత ఎంపిక.. కారణం ఏంటో తెలిస్తే..!

ఎన్నారై డెస్క్: ప్రజాస్వామ్య దేశాల ఎన్నికల్లో విజేతలెవరో తేల్చేది ప్రజల ఓట్లే. ఎవరికి ఎక్కువ ఒట్లు వస్తే వారే ఎన్నికల్లో గెలుస్తారు. అనేక సందర్భాల్లో కేవలం కొన్ని ఓట్ల తేడాతోనే విజయం దూరమైపోతుంటుంది. కానీ.. బ్రిటన్‌లోని మాన్‌మౌత్‌షైర్ కౌంటీలో జరిగిన ఎన్నికల్లో విజేతను కాయిన్ టాస్ వేసి ఎంపిక చేశారు. అదేంటి.. బ్రిటన్‌ ప్రజాస్వామిక దేశం కదా.. అంటారా..?కరెక్టే.. కానీ.. ఎన్నికల్లో నిలబడ్డ ప్రధాన అభ్యర్థులిద్దరికీ ఒకే స్థాయిలో ఓట్లు రావడంతో చివరకు కాయిట్ టాస్ వేయాల్సి వచ్చింది. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోవడంతో.. అక్కడి అధికారులు చివరకు అభ్యర్థుల అదృష్టం ఆధారంగానే విజేతను నిర్ణయించారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన టోమోస్ డేవిస్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ‘‘ఈ విషయంలో మాట్లాడుకునేదేముంది. నా ఒక్కడి ఓటు వల్ల ఒరిగేదేముంది అని అనేక మంది నాతో చెబుతుంటారు. ఆ ఒక్క ఓటు పడి ఉంటే.. ఇప్పుడు టాస్ వేసి విజేతను ప్రకటించాల్సి వచ్చేది కాదు’’ అని టాస్‌ ఓడిపోయిన నికల్సన్ పేర్కొన్నారు. 





Read more