మహనీయుల మార్గంలో పయనిద్దాం

ABN , First Publish Date - 2022-05-04T04:49:40+05:30 IST

మహనీయుల మార్గంలో పయనిద్దామని అదనపు క లెక్టర్‌ ఎన్‌.నటరాజ్‌ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదుట బసవేశ్వరుని జయంతి నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్ర జ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజానికి బసవేశ్వరుడు చేసిన సేవలు మరువలేనివని, హైందవమతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఆయన ఒకరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుని జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రాజలింగం, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ భోజన్న, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహనీయుల మార్గంలో పయనిద్దాం

ఆదిలాబాద్‌టౌన్‌, మే3: మహనీయుల మార్గంలో పయనిద్దామని అదనపు క లెక్టర్‌ ఎన్‌.నటరాజ్‌ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఎదుట బసవేశ్వరుని జయంతి నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్ర జ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజానికి బసవేశ్వరుడు చేసిన సేవలు మరువలేనివని, హైందవమతాన్ని సంస్కరించిన ప్రముఖులలో ఆయన ఒకరని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుని జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి రాజలింగం, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, తహసీల్దార్‌ భోజన్న, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బసవేశ్వర జయంతి..

బోథ్‌: మర్లపెల్లి, బోథ్‌, కౌఠ(బి) గ్రామాలలో మంగళవారం బసవేశ్వర జయంతిని లింగాయత్‌ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బసవేశ్వరుని చిత్రపటానికి పూజలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ శ్రమకు మించిన సౌందర్యం లేదని, భక్తికన్న మంచి ప్రవర్తన ముఖ్యమని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కార్యక్రమంలో బలిజ సంఘం అధ్యక్షుడు లాడేవార్‌ శంకరప్ప తుకారాం, కమలాకర్‌, సర్పంచ్‌ దేవేందర్‌, వీడీసీ అధ్యక్షుడు భాస్కర్‌, మాజీ ఎంపీటీసీ ఎర్రప్ప పాల్గొన్నారు.


Read more