మూతపడిన కోయంబేడు Market

ABN , First Publish Date - 2022-05-06T15:33:20+05:30 IST

ఏడాది పొడవునా వ్యాపారులు, సరకుల దిగుమతులు, లోడు వాహనాలతో సందడిగా కనిపించే కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌ గురువారం వాణిజ్య దినోత్సవం సందర్భంగా నిర్మానుష్యంగా

మూతపడిన కోయంబేడు Market

ప్యారీస్‌(చెన్నై): ఏడాది పొడవునా వ్యాపారులు, సరకుల దిగుమతులు, లోడు వాహనాలతో సందడిగా కనిపించే కోయంబేడు హోల్‌సేల్‌ మార్కెట్‌ గురువారం వాణిజ్య దినోత్సవం సందర్భంగా నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. 3 వేలకు పైగా దుకాణాలకు సెలవు ప్రకటించడంతో అన్నీ మూతబడ్డాయి. చిల్లర విక్రయాలు మాత్రం యధావిధిగా సాగాయి. ప్రతి ఏటా మే 5వ తేదీ వాణిజ్య దినంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, నిత్యావసర దుకాణాలు, పండ్లు, కూరగాయల దుకాణాలు తదితరాలను మూసివేసి, వ్యాపారుల సంఘాల ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలకు వ్యాపారులు తరలివెళుతుంటారు. ఈ ఏడాది వాణిజ్య దినోత్సవం సందర్భంగా కూరగాయలు, పండ్లు, పూలు, కిరాణా సరుకులు విక్రయించే కోయంబేడు మార్కెట్‌ను వ్యాపారుల సంఘాల సమాఖ్య పిలుపుమేరకు గురువారం మూసివేశారు. ఈ ప్రాంగణంలోని పూల మార్కెట్‌లో మాత్రం యధావిధిగా పూల విక్రయాలు జరిగాయి. 

Read more