బుద్గాం, కాశ్మీర్ : జమ్ముకాశ్మీర్‌లో terrorists అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. బుద్గాంలో రాహుల్ భట్ అనే Kashmiri Pandit లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలవ్వడంతో శ్రీనగర్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయినా ఫలితం దక్కలేదు. రాహుల్ భట్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. మృతుడి పేరు శ్రీ రాహుల్ భట్. చడూర గ్రామంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మైనారిటీ వర్గానికి చెందిన శ్రీ రాహుల్ భట్ లక్ష్యంగానే ఉద్రవాదులు కాల్పులు జరిపారని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. జమ్ముకాశ్మీర్‌లో ఇటివల వలస కార్మికులు, స్థానిక మైనారిటీలే లక్ష్యంగా వరుస దాడులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ దాడి జరిగిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఈ తరహా దాడులు గతేడాది అక్టోబర్‌లో మొదలయ్యాయి. బాధితుల్లో అత్యధికులు జమ్ము-కాశ్మీర్‌కు వలస వచ్చినవారు, కాశ్మీరీ పండిట్లే అధికంగా ఉంటున్నారు. అక్టోబర్‌లో కేవలం 5 రోజుల వ్యవధిలోనే ఏడుగురు పౌరులు చనిపోగా అందులో కాశ్మీరీ పండిట్లే అధికంగా ఉన్నారు.