Goa resortలో దారుణం...రష్యా బాలికపై రూం అటెండెంట్ అఘాయిత్యం

ABN , First Publish Date - 2022-05-12T17:57:05+05:30 IST

గోవా రాష్ట్రంలోని రిసార్టులో దారుణం జరిగింది....

Goa resortలో దారుణం...రష్యా బాలికపై రూం అటెండెంట్ అఘాయిత్యం

పనాజీ (గోవా): గోవా రాష్ట్రంలోని రిసార్టులో దారుణం జరిగింది. గోవా రాష్ట్రంలోని అరాంబోల్ ప్రాంతంలో ఉన్న ఓ Goa resortలో రష్యా దేశానికి చెందిన మైనర్ బాలికపై రూం అటెండెంట్ అత్యాచారం చేశారు. అరంబోల్ ప్రాంతంలోని రిసార్టులో తన కుమార్తెతో రష్యా మహిళ బస చేసింది. తన కుమార్తెను స్విమ్మింగ్ పూల్ లో వదిలి తల్లి షాపింగ్ చేసేందుకు బయటకు వెళ్లింది. రిసార్టులో రూం అటెండెంట్ గా పనిచేస్తున్న రవి (28)  స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న తన మైనర్ కుమార్తెను హోటల్ గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని రష్యా మహిళ ఫిర్యాదు చేసినట్లు పెర్నెం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ నాయక్ చెప్పారు.ఈ ఘటన అనంతరం నిందితుడు రవి పారిపోయాడు. 



ఫిర్యాదు అందుకున్న తర్వాత 24 గంటల్లోనే నిందితుడైన రవిని అరెస్టు చేశామని గోవా పోలీసులు చెప్పారు. నిందితుడు రవిపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 376, గోవా పిల్లల చట్టంలోని సెక్షన్ 8, లైంగిక నేరం, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నాయక్ తెలిపారు.

Read more