Jaggareddy: ఎర్రబెల్లివి ఆ వీడియోలు ఉన్నాయి
ABN , First Publish Date - 2022-05-03T22:35:22+05:30 IST
Minister Errabelli Dayakarraoకి కాంగ్రెస్ ఎమ్మెల్యే Jaggareddy కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకి కాంగ్రెస్ ఎమ్మెల్యే Jaggareddy కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..మంత్రిగా ఉండి ఎర్రబెల్లి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడొద్దో తెలీదా..కొంచెంమన్నా జ్ఞానం ఉండాలన్నారు.రాహుల్ గాంధీ ఫంక్షన్‌కి పోతే కూడా తప్పా అని ప్రశ్నించారు. మంత్రి ఎర్రబెల్లి పేకాట ఆడుతున్న వీడియోలు ఉన్నాయి దానికి ఏమంటారని నిలదీశారు. మంత్రిగా పేకాట ఆడడం కరెక్టా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ని ఉరికించి కొడతా అన్నావ్ కదా ఆ విషయాన్ని మరిచిపోయావా అని ఎద్దేవా చేశారు.
’సమైక్య రాష్ట్రంలో నువ్వు మంత్రి కాలేదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి నువ్వు మంత్రి అయ్యావు‘ అని చెప్పారు.చిల్లర మంత్రివి నువ్వా రాహుల్‌పై మాట్లాడేదన్నారు. రేపు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి హాలీడే ఉంది...గవర్నర్ తమిళి సై అందుబాటులో లేరని చెప్పారు..కాబట్టి రాహుల్‌గాంధీ ఓయూకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను అడుగుతానని తెలిపారు.కేసీఆర్ అపాయింట్మెంట్ కోరుతా. సీఎంకు లెటర్ కూడా రాస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.