ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2022-05-14T17:42:57+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌(AP Iset‌)-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జూన్‌ పదో తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో...

ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జూన్‌ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ.. 25న ప్రవేశ పరీక్ష


ఏయూ క్యాంపస్‌, మే 13: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌(AP Iset‌)-2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్టు కన్వీనర్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను జూన్‌ పదో తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరిస్తామన్నారు. అపరాధ రుసుంతో జూలై తొమ్మిదో తేదీ వరకు స్వీకరిస్తామని, ఇతర వివరాల కోసం ఉన్నత విద్యా మండలి(Board of Higher Education) వెబ్‌సైట్‌ https://cets. apsche.ap.gov.in చూడాలని ఆయన కోరారు. కాగా జూలై 25న ఐసెట్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు.

Read more