ఇరగ్గాసిన ఈత కాయలు

ABN , First Publish Date - 2022-05-07T05:43:37+05:30 IST

తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్యకొండ అటవీ ప్రాంత సముదాయాల్లో ఈతకాయలు విరగ్గాసాయి. గత ఏడాది చివర్లో కురిసిన వర్షాలకు చెట్లు మంచి కాపు కాశాయి.

ఇరగ్గాసిన ఈత కాయలు
మల్లయ్యకొండలో ఈత చెట్టుకు కాసిన కాయలు

తంబళ్లపల్లె, మే 6: తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్యకొండ అటవీ ప్రాంత సముదాయాల్లో ఈతకాయలు విరగ్గాసాయి. గత ఏడాది చివర్లో కురిసిన వర్షాలకు చెట్లు మంచి కాపు కాశాయి. మల్లయ్యకొండ అటవీ ప్రాంతాల్లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ ఏడాదికొకసారి వేసవిలో మాత్రమే ఈత కాయలు కాస్తాయి. కాయలు లేతగా ఉన్నపుడు ఆకుపచ్చ రంగులో ఉండి, పక్వ దశలో కాషాయ రంగులో, మాగిన తర్వాత లేత ఎరుపు, నలుపు రంగులో ఉంటాయి. ఈత పండ్లలో ఎన్నో ఔషదగుణాలతో పాటు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈత పండ్లు తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగుతుంది. అడవి జంతువులు కూడా ఈ పండ్లను ఇష్టంగా తినడం విశేషం. అటవీ సమీప గ్రామ ప్రజలు, స్థానికులు వేసవిలో ఈ అడవిలో దొరికే ఈత పండ్లను సేకరించి విక్రయించడం ద్వారా జీవనోపాధి పొందుతుంటారు. గత రెండేళ్లలో కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన చాలా మంది స్థానికులు మల్లయ్యకొండలో లభించిన ఈత కాయలు విక్రయించి జీవనం సాగించారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆకతా యిలు మల్లయ్యకొండలో అడవికి నిప్పు పెట్టడంతో చాలా వరకూ ఈత చెట్లతో పాటు, ఇతర ఫలాలనిచ్చే చెట్లు కాలిపోయాయి.  

Read more