సివిల్‌ వివాదాల్లో తలదూర్చిన inspector సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-05-13T14:44:44+05:30 IST

సివిల్‌ వివాదాల్లో తలదూర్చిన inspector సస్పెన్షన్‌

సివిల్‌ వివాదాల్లో తలదూర్చిన inspector సస్పెన్షన్‌

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌ : సుల్తాన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిపై సస్పెన్షన్‌ వేటు పడింది. సీఐగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలానికే ఆయన సివిల్‌ వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు సుల్తాన్‌బాజర్‌, కోఠి, బ్యాంక్‌ స్ట్రీట్‌ తదితర ప్రాంతాల్లోని బడాబాబుల హోటళ్లు, లాడ్జీల్లో కొనసాగుతున్న పేకాటను ఆయన ప్రోత్సహించాడనే విమర్శలు రావడంతో సీపీ సీవీ ఆనంద్‌ ఆయనను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌కు గురైన సీఐ భిక్షపతి గురువారం ఓ వ్యాపారిని ప్రభుత్వం కేటాయించిన పోలీస్‌ వాహనంలో తిప్పడం, భోజనానికి వెళ్లినా, ఏసీపీ వద్దకెళ్లినా అతడిని వెంట తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏసీపీ పరిధిలోని మరి కొంతమంది అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Read more