kurnool: కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-13T21:27:22+05:30 IST

కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందింది. ప్రసవం కోసం వరలక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు గురువారం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలుత

kurnool: కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం

-శిశువు మృతి

కర్నూలు: కర్నూలు జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందింది. ప్రసవం కోసం వరలక్ష్మిని ఆమె కుటుంబసభ్యులు గురువారం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. తొలుత ప్రసవం చేస్తామని వైద్యులు చెప్పారు. చివరకు అర్ధరాత్రి సమయంలో పరికరాలు లేవని, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో అక్కడకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా ప్రసవం చేయడం కష్టమని, కర్నూలుకు తీసుకెళ్లాలని చెప్పడంతో కుటుంబసభ్యులు వరలక్ష్మిని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రసవం చేశారు. అయితే శిశువు చనిపోయింది. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు తమకు దక్కలేదని వరలక్ష్మి బంధువులు ఆరోపిస్తున్నారు.  

Read more