కుమారుడిపై అత్యాచారం కేసు.. నిష్పాక్షిక విచారణ కోరుతున్న Rajasthan మంత్రి

ABN , First Publish Date - 2022-05-09T23:07:38+05:30 IST

తన కుమారుడిపై నమోదైన అత్యాచారం కేసు విషయంలో రాజస్థాన్ మంత్రి మహేశ్ జోషి (Mahesh Joshi) నిష్పాక్షిక విచారణకు

కుమారుడిపై అత్యాచారం కేసు.. నిష్పాక్షిక విచారణ కోరుతున్న Rajasthan మంత్రి

జైపూర్: తన కుమారుడిపై నమోదైన అత్యాచారం కేసు విషయంలో రాజస్థాన్ మంత్రి మహేశ్ జోషి (Mahesh Joshi) స్వతంత్ర, నిష్పాక్షిక విచారణకు డిమాండ్ చేశారు. మంత్రి కుమారుడు రోహిత్ జోషి (Rohit Joshi) గతేడాది తనపై జైపూర్, ఢిల్లీలలో అత్యాచారం చేశాడన్న 23 ఏళ్ల మహిళ ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఆమె ఫిర్యాదుతో కాంగ్రెస్ నేత కుమారుడిపై ఢిల్లీలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. గతేడాది జనవరి 8- ఈ ఏడాది ఏప్రిల్ 17 మధ్య బాధిత మహిళపై రోహిత్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 


ఈ ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడిన మంత్రి మహేశ్ జోషి తన కుమారుడు ఏదైనా తప్పు చేసి ఉంటే అతడిపై చర్యలు తీసుకోవచ్చని, ఈ విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అత్యాచారం ఆరోపణల వెనక రాజకీయ పరమైన సంబంధాలు ఏమైనా ఉన్నాయని భావిస్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. నిజం బయటకు వచ్చే వరకు ఈ విషయంలో తాను ఏమీ మాట్లాడదలచుకోలేదని అన్నారు.  

Read more