హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

ABN , First Publish Date - 2022-05-06T17:46:28+05:30 IST

నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్-మియాపూర్ మెట్రో స్టేషన్ లింక్ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్-మియాపూర్ మెట్రో స్టేషన్ లింక్ రోడ్డులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ రాజుకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే కారులోని వారు సంఘటనా స్థలంలోనే కారుని వదిలేసి పరారయ్యారు. కారు వివరాలతో ప్రమాదానికి కారణం అయిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read more