HYD : ఇంటర్ విద్యార్థులకు సరైన రవాణా సదుపాయాల్లేవ్.. వేలమంది గైర్హాజరు

ABN , First Publish Date - 2022-05-08T15:22:23+05:30 IST

ఇంటర్ విద్యార్థులకు సరైన రవాణా సదుపాయాల్లేవ్.. వేలమంది గైర్హాజరు

HYD : ఇంటర్ విద్యార్థులకు సరైన రవాణా సదుపాయాల్లేవ్.. వేలమంది గైర్హాజరు
FILE PHOTO

  • రవాణా.. హైరానా!
  • ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షకు 5,536 మంది గైర్హాజరు

హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌లో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. సరైన రవాణా సదుపాయాలు లేక కేంద్రాల వద్దకు చేరుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. ఇంటి నుంచి గంట ముందే బయలుదేరినప్పటికీ కొందరు విద్యార్థులు సమయానికి చేరుకోలేక పోయారు. కొందరు 8.50 వరకు కేంద్రాలకు చేరుకుని హడావిడిగా గదుల్లో కూర్చుని పరీక్ష రాశారు. తొలిరోజు పరీక్షకు 5,536 మంది గైర్హాజరయ్యారు. కాగా, మాస్‌ కాపీయింగ్‌ను అరికట్టేందుకు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. సోమాజిగూడలోని విల్లామేరీ కాలేజీ సెంటర్‌లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్నాయి.

Read more